Spirituality

మహాలయ పక్షాల్లో ఈ ఆచారాలకు ఎందుకంత ప్రాధాన్యం?..

మనిషి తన మూలాలను మరచిపోకూడదని గుర్తుచేసే పవిత్ర కాలమే పితృపక్షం.. మహాలయ పక్షాలు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పౌర్ణమితో ఈ పర్వకాలానికి శ్రీకారం చుడుతుంది. సెప్టెంబర్ 27 నుంచి పితృపక్ష శ్రాద్ధాలు ప్రారంభమై.. అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్యతో ముగుస్తాయి.

ఇక పితృపక్షం అంటే.. మనకు జన్మనిచ్చిన, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లిన పూర్వీకులను కృతజ్ఞతతో స్మరించుకునే సమయం. హిందూ సంప్రదాయంలో మనిషికి దేవ ఋణం, ఋషి ఋణంతో పాటు పితృ ఋణం కూడా ఉందని భావిస్తారు. ఆ పితృ ఋణాన్ని స్మరించుకోవడంలో శ్రాద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఈ సమయంలో పూర్వీకుల పేరుతో తర్పణం చేయడం, శ్రాద్ధం నిర్వహించడం, పిండప్రదానం చేయడం వంటి ఆచారాలు పాటిస్తారు. నీటితో తిలాలను సమర్పిస్తూ చేసే తర్పణం.. పితృదేవతల పట్ల గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీకగా భావిస్తారు.