Spirituality
మహావిష్ణువు వరాహరూపం ఎందుకు ధరించారు?..
సనాతన ధర్మంలో శ్రీమహావిష్ణువు అవతారాలకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. లోకంలో ధర్మానికి విఘాతం కలిగినప్పుడు.. సృష్టి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు.. అవసరానికి తగిన రూపంలో స్వామివారు అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలా భూదేవిని రక్షించడానికి ఆవిర్భవించిన అవతారమే.. వరాహావతారం అని అంటున్నారు. పురాణ కథనం ప్రకారం.. హిరణ్యాక్షుడి కారణంగా భూమి జలగర్భంలోకి వెళ్లిపోయింది. భూదేవిని తిరిగి పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మహా వరాహరూపాన్ని ధరించి.. ఆ అగాధ జలాల్లోకి ప్రవేశించాడు. తన బలమైన కోరలపై భూదేవిని నిలిపి.. సముద్ర గర్భం నుంచి పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత భూదేవిని తన స్థానంలో ప్రతిష్ఠించి.. హిరణ్యాక్షుడిని సంహరించాడు.
