Spirituality

గణేషుడి నిమజ్జనం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి?.

గణేషుడి నిమజ్జనంతో మనిషి జీవితానికి సనాతన ధర్మం అందించే గొప్ప ఆధ్యాత్మిక సందేశంగా చెబుతారు.. వినాయకుడిని మట్టితో ప్రతిష్ఠించి.. భక్తిశ్రద్ధలతో పూజించి.. చివరకు అదే మట్టిని నీటిలో కలపడం వెనుక లోతైన తత్వం దాగి ఉందని అంటారు. పురాణ, ఆగమ సంప్రదాయాల భావనలో గణపతి ప్రకృతి తత్వానికి ప్రతీక. భూమి నుంచి రూపాన్ని తీసుకున్న విగ్రహం.. పూజ ద్వారా దైవస్వరూపంగా ఆరాధించబడుతుంది. అనంతరం నిమజ్జనంతో ఆ రూపం మళ్లీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది సృష్టి, స్థితి, లయ అనే ప్రకృతి చక్రాన్ని మన కళ్లముందు చూపించే ఆధ్యాత్మిక ప్రక్రియగా భావించవచ్చు.