Spirituality
ఇంద్రియాలలో పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది!..
మానవ దేహం పంచభూతాలతో నిర్మితమైన ఒక దివ్య దేవాలయం. మన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కేవలం భౌతిక ప్రపంచాన్ని అనుభవించే సాధనాలు మాత్రమే కావు. వాటి వెనుక చైతన్యరూపంలో ప్రకాశించేది ఆ పరమాత్మే!.. కృష్ణ యజుర్వేదానికి చెందిన కఠోపనిషత్తులో నచికేతుడు, యమధర్మరాజుల సంభాషణ ద్వారా ఈ సత్యం వెల్లడవుతుంది. భగవంతుడు ఇంద్రియాలను బయటి ప్రపంచాన్ని చూడటానికే సృష్టించినప్పటికీ, జ్ఞాని అయినవాడు ఆ ఇంద్రియాల వెనుక ఉన్న అంతర్యామిని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానమే మోక్షానికి మార్గం అని ఈ ఉపనిషత్తు ప్రభోధిస్తుంది.
