Spirituality

Spirituality: దేహమేరా దేవాలయం అని చెప్పడంలో అర్థం ఏమిటి?..

మన సనాతన ధర్మం ఈ దేహం వెనుక ఉన్న ప్రాణశక్తిని, చైతన్యాన్ని, ఆత్మతత్త్వాన్ని గుర్తించమని చెబుతుంది. అందుకే మనిషి శరీరాన్ని సాధారణమైన భౌతిక రూపంగా కాకుండా, దైవతత్వాన్ని అనుభవించడానికి లభించిన పవిత్ర సాధనంగా ఈ జన్మను సనాతన సంప్రదాయం భావించింది.

ఈ భావంతో మన శరీరాన్ని కూడా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ఒక పవిత్ర క్షేత్రంగా చూసింది. అందుకే "దేహో దేవాలయః ప్రోక్తః.. జీవో దేవః సనాతనః" అనే భావన మన సంప్రదాయంలో కనిపిస్తుంది. అంటే ఈ దేహమే దేవాలయం... ఇందులో ఉన్న జీవచైతన్యమే సనాతనమైన దైవస్వరూపం.