Spirituality
మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది!
మనిషి జీవితం ఒక వెలిగే జ్యోతి వంటిది.. ప్రమిదలో నూనె ఉన్నంతవరకు దీపం వెలుగుతుంది.. ఆ నూనె అయిపోయిన క్షణమే జ్యోతి ఆరిపోతుంది. అలాగే మానవ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే జీవితం కొనసాగుతుంది. శ్వాస ఆగిపోయిన క్షణంలో.. మనం ఎంతో ప్రేమగా చూసుకున్న ఈ దేహం కేవలం పంచభూతాల సమాహారంగా మిగిలిపోతుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. మరణం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు..
ఇక ప్రతి ఒక్కరి జీవితంలోనూ తప్పనిసరిగా వచ్చే చివరి ఘట్టం మరణం.. అయితే ఒక మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది?.. చివరి శ్వాస తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?.. మనిషి చనిపోయిన వెంటనే అంతా అయిపోయినట్టేనా?.. లేక అక్కడి నుంచే మరో ప్రయాణం మొదలవుతుందా?.. అనే ప్రశ్నలు ఆథ్యాత్మిక భావాలతో జీవించే వారి మదిలో తరచుగా మెదులుతాయి.. అయితే వీటికి సమాధానాలు గరుడ పురాణంలో వివరించినట్టు పండితులు చెబుతారు.
