Spirituality
మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?
మరణం అంటే అన్నీ ముగిసిపోవడమేనా? లేక మరో ప్రయాణానికి ఆరంభమా? భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నదేమిటంటే.. శరీరానికి మాత్రమే మరణం.. ఆత్మకు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు.. మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినట్లే.. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని స్వీకరిస్తుంది. మన కర్మలు, ఆలోచనలు, కోరికలే తదుపరి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మరణానికి భయపడటం కంటే.. బతికున్నంత కాలం మంచి కర్మలు చేయడం, ఇతరులకు మేలు చేయడం, మనసును పవిత్రంగా ఉంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక భావన అని అంటున్నారు..
