Spirituality

Spirituality: తిరుమలలో ఏకైక శైవ క్షేత్రం.. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత తెలుసా?..

భూలోక వైకుంఠంగా భక్తులు భావించే తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయం ఉంది. శ్రీవేంకటేశ్వరుడు కొలువైన ఈ వైష్ణవ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పరమేశ్వరుడు ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది. అందుకే తిరుమల యాత్రలో కపిలతీర్థానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది.

తిరుపతిలోని అలిపిరికి సమీపంలో ఉన్న కపిలతీర్థం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వరస్వామి శివలింగం గుహాలయంలో దర్శనమిస్తుంది. కపిలేశ్వరుడితో పాటు కామాక్షి అమ్మవారు, నరసింహస్వామి తదితర దేవతామూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.