Spirituality
పురుషులే పిండప్రదానం చేయాలా?..
పితృదేవతలను స్మరించుకోవడం అంటే మనకు జన్మనిచ్చిన వంశపారంపర్యానికి కృతజ్ఞత చెప్పడం. అందుకే సనాతన ధర్మంలో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే పిండప్రదానం విషయంలో మహిళలకు అధికారం ఉందా అనే సందేహం చాలాకాలంగా ఉంది. సాధారణంగా పురుషులే ఈ కర్మలను నిర్వహించడం కనిపించడంతో.. మహిళలు చేయకూడదనే భావన ఏర్పడింది. గరుడ పురాణంలోని కొన్ని సందర్భాల్లో కుమారుడు లేని పరిస్థితుల్లో భార్య, కుమార్తె వంటి కుటుంబ సభ్యులకు కొన్ని పితృకర్మలు నిర్వహించే అవకాశం ప్రస్తావించబడింది. ఉదాహరణకు గరుడ పురాణంలోని ఒక శ్లోకం.. కుమారుడు లేనప్పుడు భార్య, కుమార్తె లేదా కుమార్తె కుమారుడు వంటి వారిని కర్మ నిర్వహణలో పేర్కొంటుంది.
