Spirituality
కామం-క్రోధం దుర్గుణాలా?.. దైవశక్తులా?..
మన ధర్మగ్రంథాలలో ఉన్న అంతర్యాన్ని లోతుగా గమనిస్తే.. ఒక అద్భుతమైన సత్యం బోధపడుతుంది. కామక్రోధాలు కేవలం మనల్ని పతనం చేసే శత్రువులు మాత్రమే కావు.. అవి మన అంతరంగంలో దాగివున్న అపరిమితమైన ప్రచండ శక్తులు.. సృష్టిలోని ప్రతి భావన వెనుక ఒక దివ్యమైన ప్రయోజనం దాగి ఉంది. ఆ శక్తిని ఎలా నియంత్రిస్తున్నాం, ఏ దిశగా నడిపిస్తున్నాం అనేదే మన జీవిత పరమార్థాన్ని నిర్దేశిస్తుందని ఇవి తెలియజేస్తాయి.. కామం అంటే కేవలం ఇంద్రియ కోరిక కాదు. ఏదైనా సాధించాలనే ఆకాంక్ష కూడా కామమే.. జ్ఞానం పొందాలనే కోరిక కావచ్చు.. ధర్మాన్ని ఆచరించాలనే తపన కావచ్చు.. సమాజానికి మేలు చేయాలనే సంకల్పం కావచ్చు.. అందుకే కోరికకు వివేకం తోడైతే అది లక్ష్యంగా కూడా మారుతుందని చెబుతారు..
