Spirituality
నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలి?..
నాగపంచమి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, ఈశాన్య మూలలో అష్టదళ పద్మ ముగ్గు వేసి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పాలు, శుద్ధజలం, తేనెతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. తెల్లటి పుష్పాలు, గరిక సమర్పించి.. పాలు, చలిమిడి, వడపప్పు, బెల్లం, నువ్వుల పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. దీపారాధన, ధూపం అనంతరం నవనాగ స్తోత్రాన్ని జపించి కర్పూర హారతి ఇవ్వాలి. భక్తిశ్రద్ధలతో నాగదేవతను ఆరాధిస్తే ఆధ్యాత్మిక శాంతి, మానసిక ధైర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
