Spirituality
గుడిలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?..
భగవంతుని అనుగ్రహం కోసం, పూర్ణ శరణాగతిని ప్రకటిస్తూ చేసే అత్యున్నత పవిత్ర ప్రక్రియే సాష్టాంగ నమస్కారం. శరీరంలోని ఎనిమిది అంగాలను నేలకు తాకిస్తూ, స్వామివారిని కళ్లతో ధ్యానిస్తూ, మనస్సుతో ఆయన రూపాన్ని స్మరిస్తూ, వాక్కుతో దైవనామాన్ని జపిస్తూ ఈ నమస్కారాన్ని ఆచరిస్తారు. అహంకారాన్ని, వికారాలను భగవంతుని పాదాల చెంత సమర్పించి, మన ఉనికిని పూర్తిగా దైవానికి అర్పించడమే దీని అంతరార్థం..
