Spirituality
శ్రీ రాముడిలో వున్న ఈ గొప్పతనం ఎందరికి తెలుసు!..
శ్రీరాముడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం!.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా... పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా... ఇచ్చిన మాటను, ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టని మహోన్నత వ్యక్తిత్వం ఆ రామయ్యది.. అందుకే శ్రీరాముడిని మర్యాదా పురుషోత్తముడిగా, ధర్మమూర్తిగా భారతీయులు ఆరాధిస్తారు. లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటుందంటే దానికి కారణం..ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు...
