Spirituality

విగ్రహ ప్రతిష్టాపనతో రాయి దేవునిగా ఎలా మారుతుంది!..

విగ్రహ ప్రతిష్టాపన అనేది ఒక శిలకు రూపం ఇవ్వడం కాదు... భక్తికి దైవచైతన్యాన్ని అందించే పవిత్ర ప్రక్రియగా శాస్త్రాలు చెబుతాయి. అయితే, కేవలం రూపం సిద్ధించినంత మాత్రాన ఆ రాయి దేవుడు అయిపోడు. ఆ రూపానికి దైవత్వాన్ని ఆవహింపజేసే మహత్తర ఘట్టమే ప్రతిష్టాపన. వేద మంత్రోచ్ఛారణలు, హోమాలు, జలాధివాస, ధాన్యాధివాసాలు, మూలికా సమర్పణల ద్వారా ఆ రాయిలో ఉన్న ప్రతి పరమాణువును శుద్ధి చేస్తారు. అప్పటి వరకు అది కేవలం శిల మాత్రమే. కానీ అదే శిల దేవాలయంలో ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తుల కళ్లకు సాక్షాత్తూ దైవస్వరూపంగా కనిపిస్తుంది.