Spirituality

రాఖీ పండగా ఎలా వచ్చింది?..పురాణాలు ఏం చెబుతున్నాయి..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రక్షాబంధన్ వెనుక ఎన్నో పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు దాగి ఉన్నాయి. అందుకే రాఖీ పౌర్ణమి కేవలం వేడుక కాదు... అది జన్మజన్మల బంధానికి శ్రీరామరక్ష. కాలాలకు అతీతంగా, పురాణాల సాక్షిగా నిలిచిన సనాతన ధర్మ మహోన్నత సంప్రదాయం.. ఇక త్రేతాయుగానికి పూర్వమే కృతయుగంలో రాఖీ విశిష్టత కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రాక్షసరాజు ధాటికి దేవేంద్రుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో ఇంద్రాణి (శచీదేవి) పరమశివుడి అనుగ్రహంతో ఒక పవిత్రమైన రక్షణ దారాన్ని పూజించి, దేవేంద్రుడి మణికట్టుకు కట్టింది. ఆ దివ్య రక్షాసూత్రం ఇచ్చిన బలంతోనే ఇంద్రుడు అసురులపై విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడని ఇతిహాసం..