Spirituality

గణేశుడి ఎనిమిది అవతారాల విశిష్టత ఇదే!..

మనం ఏ కొత్త పని ప్రారంభించినా, ఏ శుభకార్యానికి శ్రీకారం చుట్టినా ముందుగా తలచుకునేది ఆ బొజ్జ గణపయ్యనే! విఘ్నాలను తొలగించి, విజయాన్ని అందించే లంబోదరుడు బుద్ధికి, విచక్షణకు, మహా జ్ఞానానికి ప్రతీక. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను దాటుకుంటూ సన్మార్గంలో ఎలా సాగాలో వినాయకుని రూపం, ఆయన విశిష్టత మనకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. వినాయకుడి రూపం వెనుక ఎంతటి ఆధ్యాత్మిక తత్త్వం ఉందో.. ఆయన అవతారాల కథలు అంతకంటే లోతైన సందేశాన్ని అందిస్తాయి. ఇక గణేశుడి అవతారాల గురించి ప్రధానంగా ముద్గల పురాణంలో విశదంగా ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పురాణం గణపతికి సంబంధించిన ఎనిమిది ప్రధాన అవతారాలను వివరిస్తుంది. ప్రతి అవతారం ఒక దుష్టశక్తిని సంహరించడంతో పాటు.. మనిషి అంతరంగంలోని ఒక దుర్గుణాన్ని జయించాల్సిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది.