Spirituality
నిత్యం ఇంట్లో కుటుంబ కలహాలు ఏ దోషం వల్ల జరుగుతాయి!!
ఇంట్లో చిన్న విషయానికే గొడవలు.. మాట మాటకూ మనస్పర్థలు.. ఒకే కుటుంబంలో ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం.. ఇలాంటి పరిస్థితులను మన పెద్దలు కేవలం బయట కనిపించే కారణాలతోనే చూడలేదు. కుటుంబంలో శాంతి క్షీణించడానికి మనిషి ప్రవర్తన, ఆలోచనలు, ధర్మాచరణ కూడా కారణమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కుటుంబ ధర్మం క్షీణిస్తే అధర్మం పెరుగుతుందని వివరిస్తాడు. కుటుంబాన్ని నిలబెట్టే విలువలు, పరస్పర గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ధర్మబద్ధమైన జీవనం తగ్గిపోతే కలహాలకు వాతావరణం ఏర్పడుతుందని ఈ బోధలో అంతర్లీనమైన సందేశం.అలాగే గీతలో మరో ముఖ్యమైన విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతాడు. మనసు ఒక విషయంపై పదేపదే నిలిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది.. ఆసక్తి కోరికగా మారుతుంది.. కోరిక నెరవేరకపోతే కోపం పుడుతుంది. ఆ కోపమే చివరికి వివేకాన్ని దెబ్బతీస్తుంది.
