Spirituality

Spirituality: మాంసాహారం తింటే తామస గుణాలు పెరుగుతాయా?..

మనిషి ఏది తింటాడో అది కేవలం శరీరాన్ని మాత్రమే పోషించదు.. అతని మనస్సు స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుందని భారతీయ వేదాంత సంప్రదాయం భావిస్తుంది. అందుకే ఆహారాన్ని కేవలం రుచి కోసం కాకుండా.. అది మనలో ఎలాంటి భావాలను, ఎలాంటి ఆలోచనలను పెంపొందిస్తుందనే దృష్టితో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి.

సనాతన ధర్మంలో ప్రకృతి మూడు గుణాలుగా వ్యక్తమవుతుందని భగవద్గీత వివరిస్తుంది. అవే సత్త్వం, రజస్సు, తమస్సు. సత్త్వం అంటే జ్ఞానం, ప్రశాంతత, పవిత్రత, వివేకం వైపు నడిపించే స్వభావం. రజస్సు అంటే కోరిక, చంచలత్వం, ఆవేశం, కర్మఫలంపై ఆసక్తి. తమస్సు అంటే అజ్ఞానం, మోహం, అలసత్వం, నిర్లక్ష్యం, వివేకాన్ని కప్పివేసే స్వభావం. ఈ మూడు గుణాలు మనిషి ఆహారంలోనూ ప్రతిబింబిస్తాయని భగవద్గీత పదిహేడో అధ్యాయం చెబుతుంది.