హనుమంతుడికి మంగళవారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా?..
భక్తికి ప్రతిరూపం, బలానికి ప్రతీక, ధైర్యానికి నిలువెత్తు రూపం హనుమంతుడు.. తనలో అపారమైన శక్తి ఉన్నా... ఆ స్వామిలో ఎక్కడా అహంకారం కనిపించదు. ఎంతటి కార్యమైనా శ్రీరాముడి ఆజ్ఞగా భావించి, నిస్వార్థంగా పూర్తి చేయడమే ఆయన గొప్పతనం.. వినయం, విశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం... ఇలా హనుమంతుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో గుణాలు ఉన్నాయి.. కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గని ఆత్మవిశ్వాసం.. ప్రభువు పట్ల చెక్కుచెదరని భక్తి... అందుకే హనుమంతుడు కేవలం దేవుడు మాత్రమే కాదు.. ప్రతి మనిషికి ధైర్యాన్ని నింపే ఆదర్శమూర్తి! అని పురాణాలు తెలియజేస్తున్నాయి.సాధారణంగా హిందువులు రోజూ పూజలు చేసినప్పటికీ, మంగళవారం రాగానే ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తులతో పోటెత్తుతాయి. దీని వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాలు చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి.
