Spirituality
Spirituality: మనిషిని బంధించే అసలైన సంకెళ్లు ఏవో తెలుసా?..
మనిషి చేతులకు వేసే సంకెళ్లు కనిపిస్తాయి. వాటిని తెంచుకోవడానికి మార్గం కూడా కనిపిస్తుంది. కానీ మనిషిని జీవితాంతం బంధించే కొన్ని సంకెళ్లు మాత్రం కంటికి కనిపించవు. అవే కోరికలు, మమకారం, అహంకారం, ఇష్టాయిష్టాలు. వేదాంత దృష్టిలో వీటన్నింటికీ మూలకారణం అవిద్య.. అంటే మన అసలైన స్వరూపాన్ని మనమే మరచిపోవడం.
సనాతన ధర్మ తత్వం ప్రకారం జీవుడి అసలు స్వరూపం శాశ్వతమైన ఆత్మ. శరీరం మారుతుంది, పరిస్థితులు మారతాయి, సంబంధాలు మారతాయి. కానీ ఆత్మ నిత్యమైనదని ఉపనిషత్తులు బోధిస్తాయి. అయితే మనిషి తనను తాను శరీరంతోనే గుర్తించుకోవడం మొదలుపెట్టినప్పుడు బంధం మొదలవుతుంది. నేను ఈ శరీరం, ఇది నాది, నాకు ఇది కావాలి, అది నాకు వద్దు అనే భావనలు క్రమంగా మనసుపై పట్టు సాధిస్తాయి.
