Spirituality
నమస్కారంలో దాగి ఉన్న ఆథ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నమస్కారం అనేది కేవలం ఒక శారీరక చర్య కాదు. అది మనిషిలోని అహంకారాన్ని కరిగించే సాధన. తనను తాను భగవంతుని చైతన్యానికి సమర్పించుకునే పవిత్రమైన ప్రక్రియ. మనిషి తన శిరస్సును వంచినప్పుడు వంగేది కేవలం శరీరం కాదు.. తనలోని నేను అనే అహంకారం. చేతులు జోడించినప్పుడు రెండు చేతులు మాత్రమే కలవకూడదు.. మనస్సు కూడా భాగ్యవంతునితో ఏకమవ్వాలి. అప్పుడే నమస్కారానికి నిజమైన అర్థం లభిస్తుందని చెబుతారు. నమః అంటే శరణాగతి.. సమర్పణ.. అహంకార త్యాగం.. నేనే చేశాను.. నాకే అన్నీ తెలుసు.. నాదే గొప్ప అనే భావనకు బదులుగా.. నీవే కర్త.. నీవే రక్షకుడు.. నీవే నా ఆధారం.. నేను నీ శరణాగతుడను అనే భావన కలగాలి. అప్పుడే నమస్కారం ఒక శారీరక చర్య నుంచి ఆధ్యాత్మిక సాధనగా మారుతుందని పండితులు చెబుతారు.
