Spirituality
Spirituality: తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయా?..
తెల్లవారుజామున కనిపించే కలలకు మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు, బాహ్య ప్రపంచంతో సంబంధం కొంత తగ్గి అంతర్ముఖ స్థితి పెరుగుతుందని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ సమయంలో కనిపించే కొన్ని స్వప్నాలను సాధారణ కలల కంటే ప్రాధాన్యంగా చూసే ఆచారం ఏర్పడింది.
అయితే తెల్లవారుజామున వచ్చిన ప్రతి కల భవిష్యత్తులో తప్పకుండా నిజమవుతుందని శాస్త్రాలు చెప్పలేదు. అగ్ని పురాణంలోని స్వప్నాధ్యాయంలో రాత్రిని వివిధ భాగాలుగా విభజించి, ఏ సమయంలో స్వప్నం కనిపిస్తే దాని ఫలితం ఎప్పుడు కలుగుతుందనే విషయాన్ని వివరిస్తుంది.
