Spirituality

మానవాళికి నిత్య మార్గదర్శి... శ్రీకృష్ణుడి జీవితంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!.

ఈ విశ్వం ఒక లీల అయితే, ఆ లీలలకు మూలమైన పరమాత్మ స్వరూపం శ్రీకృష్ణతత్వం. మానవుడిగా భూమిపై అవతరించి, జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణను చిరునవ్వుతో స్వీకరించి, సకల మానవాళికి ఆత్మజ్ఞానాన్ని అందించిన పూర్ణావతారమే కృష్ణావతారం అని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.. ఆ జగన్నాథుని అవతరణ సాధారణమైనది కాదు. సరిగ్గా 5,252 సంవత్సరాల క్రితం, సాధారణ పూర్వ శకం (B.C.E) 3228 జులై 18న, శ్రావణ మాసంలో, కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు, రోహిణీ నక్షత్రంలో, బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఆ పరమాత్మ మధురలో దేవకీ వసుదేవుల కడుపున జన్మించారు