Spirituality
తిరుమలలో తెలియని ఆధ్యాత్మిక విశేషం.. పరిమళపు అర రహస్యం!..
తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుందని మన పురాణాలు చెబుతాయి. అలాంటి విశిష్ట ప్రదేశాల్లో ఒకటి.. యోగ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో, దక్షిణాభిముఖంగా ఉన్న రాతిశిల. భక్తులు ప్రేమగా దీనిని పరిమళపు అర అని పిలుస్తారు.
పూర్వకాలంలో ప్రతి గురువారం.. మరుసటి రోజు జరిగే శుక్రవార అభిషేకానికి ఏర్పాట్లు ఇక్కడే జరిగేవని ఆలయ సంప్రదాయం చెబుతోంది. ముఖ్యంగా.. శ్రీవారి నుదుటన అలంకరించే ఊర్ధ్వపుండ్రానికి అవసరమైన పచ్చకర్పూరాన్ని ఈ సానరాతిపై నూరేవారు. అంతేకాదు.. పునుగు, జవ్వాది, కస్తూరి, కుంకుమపువ్వు వంటి పరిమళ ద్రవ్యాలను కూడా ఇక్కడే సిద్ధం చేసేవారని చెబుతారు.
