తెలంగాణ

మహిళా భద్రత, డయల్ 100 వ్యవస్థ మెరుగుపై ప్రత్యేక దృష్టి: నూతన సీపీ మహేశ్ భగవత్!

హైదరాబాద్‌ నగర కొత్త పోలీస్‌ కమిషనర్‌గా (కొత్వాల్‌) నిష్ణాతులైన సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మహేశ్‌ భగవత్‌కు నగర పోలీసింగ్‌పై అపారమైన అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు భాగ్యనగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర సేవలందించే 'డయల్ 100' రెస్పాన్స్ వ్యవస్థను మరింత వేగవంతం చేసి మెరుగుపరుస్తామని తెలిపారు.