తెలంగాణ

విదేశీ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎన్నిరోజులంటే?

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. స్టడీ టూర్‌లో భాగంగా పలు దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 8 వరకు స్పీకర ప్రసాద్ పర్యటన కొనసాగనుంది. స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ దేశాల్లో స్పీకర్ బృందం పర్యటించనుంది. అందులో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఆయన సతీమణి బండ అనితాప్రకాశ్‌, కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్పీకర్‌ ఓఎస్డీ వెంకటేశ్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఆయా దేశాల్లోని పార్లమెంట్‌ హౌస్‌లను సందర్శించనున్నారు.అంతేకాకుండా, అక్కడి భారత రాయబార కార్యాలయాల సీనియర్ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.