తెలంగాణ

నైరుతి నిష్క్రమణ.. ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అంచనావేశారు. దీంతో తెలుగు ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎండ తీవ్రత తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఎల్ నినో కారణంగా రెండు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగుకు నీరు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల వైపు ఈశాన్య రుతుపవనాలు వేగంగా దూసుకు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఏపీ, తెలంగాణల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు దంచికొట్టే అవకాశమున్నట్టు అంచనా వేశారు.