స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
South vs North India Movements: సౌత్‌లో ఉద్యమాలు తగ్గాయా?
నిరుద్యోగ సమస్య ఉందని మొత్తుకుంటున్నరు కానీ ఏ పని చేయడానికి మనోళ్లు సిద్ధంగా లేరంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘‘దావత్‌లు ఎక్కువ అవుతున్నాయి. పనికి వెళ్లినా ఫోన్‌తో ఎక్కువగా గడుపుతున్నారు. చిన్న పని చేయాలన్నా ఇతర రాష్ట్రాల వాళ్లే చేస్తున్నారు’’ అని గుత్తా అన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగిపోతున్నాయని, మనవాళ్లు 40 కిలోల బస్తాలను కూడా మోయలేకపోతున్నారని వాపోయారు.
