National

South Central Railway: రైలు ప్రయాణికులకు అధికారుల హెచ్చరిక.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!..

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక చేసింది. రిజర్వేషన్ ఉన్న కోచ్‌లలో సరైన టికెట్ లేదా అనుమతి లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. జనరల్ టికెట్‌తో రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణిస్తే రూ.2 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే, రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడి సీటును ఆక్రమించి ఇబ్బంది పెడితే రూ.1,000 వరకు జరిమానా పడొచ్చు. జరిమానా చెల్లించకపోతే కేసు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులు తమకు కేటాయించిన కోచ్‌లోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచించారు.