International

South Africa: భారత సంతతి మహిళను వరించిన నోబెల్ శాంతి పురస్కారం!..

భారత సంతతి మహిళను నోబెల్ శాంతి పురస్కారం వరించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది నవనీతం "నవి" పిళ్లై 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. 1941లో డర్బన్‌లోని భారతీయ సంతతి కుటుంబంలో జన్మించిన పిళ్లై, అపార్త్‌హైడ్ (జాతి వివక్ష) పాలనలోనే పెరిగి పెద్దయ్యారు. ఆ పరిస్థితులను అధిగమించి, దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేసిన తొలి భారతీయ సంతతి మహిళల్లో ఒకరిగా ఆమె చరిత్ర సృష్టించారు.