National

తీహార్ జైలుకు సౌరవ్, రంకా.. మోడీ ఇంత పిరికివాడా? : అభిజీత్ దీప్కే

దేశంలో ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న నిరసన ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సీజేపీ జాతీయ ప్రతినిధులు సౌరవ్ దాస్,ఆశుతోష్ రంకాలు నిన్న పోలీసుల అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లో నిరసనలు చేపట్టారు. జాతీయ జెండాను చేతబట్టుకుని నిరననలు తెలపగా.. ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించారని వారి మీద అభియోగం మోపారు.ఈ క్రమంలోనే వారిని ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హాజరుపరచగా.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్‌లకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరిని తీహార్ జైలుకు తరలించారు.