తెలంగాణ
జన్వాడలో మట్టి మాఫియా? ఉస్మాన్ సాగర్ పరిధిలో అక్రమ తవ్వకాలపై అధికారుల మౌనం
జన్వాడ గ్రామంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న భారీ మట్టి తవ్వకాలు ఇప్పుడు ఉస్మాన్ సాగర్ భద్రత, ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ, రాజకీయ పలుకుబడిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి, పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని చెబుతున్నారు.
