National
social media: డీప్‌ఫేక్‌లపై కేంద్రం ఫోకస్.. అమల్లోకి కొత్త నిబంధనలు!..
డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించే తప్పుడు కంటెంట్ దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికల్లో వినియోగదారులను మోసపూరిత కంటెంట్ నుంచి రక్షించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
