వ్యాపారం
Smartphone Price Hike: చుక్కలు చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల ధరలు.. పండగ ఆఫర్లపై ఆశలు!
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు మొబైల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. రియల్మీ, ఒప్పో, వివో, శాంసంగ్, వన్ప్లస్ వంటి దిగ్గజ బ్రాండ్లు తమ ఎంపిక చేసిన మోడళ్లపై భారీగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. స్మార్ట్ఫోన్ తయారీలో అత్యంత కీలకమైన చిప్సెట్లు, ర్యామ్ (RAM), స్టోరేజీ మెమోరీ విడిభాగాల వ్యయం అంతర్జాతీయంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
