National

Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 30% పెరగనున్న ధరలు!

Smartphone Price Hike: కొత్త స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్న వాళ్లకి బ్యాడ్ న్యూస్. మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల రేట్లు ఊహించని రీతిలో ఏకంగా 30 శాతం వరకు పైకి ఎగబాకే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ 'జెఫ్రీస్' తాజా నివేదికలో హెచ్చరించింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డేటా సెంటర్లు, ఏఐ నెట్‌వర్క్‌ల విస్తరణ కోసం పెద్ద ఎత్తున మెమొరీ చిప్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న మెమొరీలో అత్యధిక వాటాను ఈ కంపెనీలే ఎగరేసుకుపోతుండటంతో తీవ్ర కొరత ఏర్పడింది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం చిప్ డిమాండ్‌లో 60 శాతానికి పైగా ఏఐ కంపెనీలదే ఉండనుందని అంచనా. ఈ విపరీతమైన పోటీ వల్ల ముడిసరుకు ధరలు చుక్కలనంటుతున్నాయి.