తెలంగాణ
Smart Ration Cards: ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం.. 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Smart Ration Cards: తెలంగాణలో ఆహార భద్రతకు ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోతవ్సం ఆగస్టు 15న సంగారెడ్డిలో కార్డుల పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
