తెలంగాణ

కరెంట్ సబ్సిడీ ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు : కవిత

తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న కరెంట్ సబ్సిడీని ఎత్తేయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకే ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దీనిలో భాగంగానే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల నెక్లెస్ రోడ్డులో స్మార్ట్ మీటర్ల ఉపయోగం పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉందని పదే పదే నిరూపించుకుంటోందని ఆరోపించారు.