తెలంగాణ

స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు!

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్లు అమర్చాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం తెరమీదకు రాగా.. అమలులో ఆలస్యం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. సీఎంవో నుంచి విద్యుత్ శాఖకు ఆదేశాలు వెళ్లాలని కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చాలని సర్కార్ సంకల్పించినట్టు తెలుస్తోంది. అయితే, పాత మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లు అమర్చుకోవాలంటే కాస్త ఎక్కువ ఖర్చు భరించాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చును ఎవరు భరిస్తారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే సర్కారు వద్ద డబ్బులు లేవని పదే పదే చెబుతోంది. సమయం, సందర్బం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఊటంకిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చడం వలన రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకోవాలని, ఆదాయం పెంచుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.