తెలంగాణ

చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?

TG : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా గణేశ్ నిమజ్జనాల విషయంలో హైడ్రా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు.