తెలంగాణ
SircillaPolitics: కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ.. సిరిసిల్లలో రేవంత్ సభ బెడిసికొట్టిందా?!
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచుకోట అయిన సిరిసిల్లలో సీఎం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయమైంది. ఒక వైపు పార్టీ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. రేవంత్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్ఛిన 'టీడబ్ల్యూయూ' ఘోర పరాజయంపాలు కావడం స్థానిక రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
