తెలంగాణ

sircilla: కేటీఆర్ కంచుకోటలోకి కాంగ్రెస్ ఎంట్రీ!!..

బీఆర్ఎస్ నియోజకవర్గాలే టార్గెట్ గా సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి కే తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ బుధవారం సాయంత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు.