తెలంగాణ

SIR: "సర్‌" నోటీసులిచ్చినంత మాత్రాన విచారణకు రానక్కర్లేదు.. ఈసీ కీలక ప్రకటన

SIR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈజీ) తెరదించింది. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చే 'సర్‌' నోటీసులు అందుకున్నంత మాత్రాన సామాన్య ఓటర్లు నేరుగా వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అత్యంత అనివార్యమైన, అత్యవసరమైన సాంకేతిక సందర్భాల్లో మినహా సాధారణ జనాలను విచారణ పేరిట ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.