తెలంగాణ

‘ఎస్ఐఆర్’ కరెక్ట్ కాదు..సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం : ఎంపీ అసద్

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అమలు తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ వలన దేశంలోని పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డాక్యుమెంట్ల కోసం తిరుగుతూ వారి ఆత్మగౌరవం మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఒవైసీ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం అని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ఓటింగ్ ఆధారంగా జరగాలని ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.