వైరల్ న్యూస్

SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన "సర్"

ఒక సర్టిఫికెట్ కోసం వెతుకులాట.. 35 ఏళ్లుగా దూరమైన అన్నను కలిపింది. SIR వెరిఫికేషన్ కోసం చిన్ననాటి స్కూల్ సర్టిఫికెట్ కావాల్సి రావడంతో తన పుట్టిన ఊరికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. పాత పాఠశాల సిబ్బంది సర్టిఫికెట్ కోసం ఆరా తీస్తుండగా.. అతడి కుటుంబ వివరాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు 35 ఏళ్లుగా కనిపించని అన్న ఆచూకీ లభించింది. అన్నను కళ్లారా చూసిన క్షణంలో తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.