National

ఎస్ఐఆర్ వివాదం.. ‘ఫారమ్ -6’ ఉపసంహరణ వెనుక ఎవరున్నారు? : రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మీద తీవ్రదుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే ఓట్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుకుంటుందని, ప్రతిపక్షపార్టీల అనుకూల ఓట్లను డిలీట్ చేస్తుందని పొలిటికల్ పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలు, నాయకులు ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజీనామా కోరుతూ రేపటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి దేశవ్యాప్త పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఫారమ్-6(తాతముత్తాలకు సంబంధించిన పత్రాలు)అడగటాన్ని ఉపసంహరించకుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆన్‌లైన్ ఫారం-6ను చట్టవిరుద్ధంగా మార్చారు? ఈసీ సొంత కమిషనర్లే ఈ విషయంపై అభ్యంతరం తెలిపారు. ఈసీఐలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఆ మార్పు చేయమని ఎవరు ఆదేశించారు?’ అని అడిగారు.