తెలంగాణ

సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..

మైక్రో ఫైనాన్స్ వివాదంలో గాయని మంగ్లీకి సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంగ్లీతో తాను రాజీ పడినట్లు వస్తున్న వార్తలను అడ్వకేట్ సుబ్బు ఖండించారు. కోట్ల ఆఫర్ వచ్చినా తాను లొంగలేదని, ఈ కేసులో నిజా నిజాలు తేలే వరకు మంగ్లీకి విదేశాల్లో అవకాశాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. బాధితులపై ఆంక్షలు విధిస్తున్న పోలీసులు, నిందితురాలిగా ఉన్న మంగ్లీ దేశం దాటి వెళ్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారని నిలదీశారు. ఆమెను కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరని ప్రశ్నిస్తూ, కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడో చెప్పాలని సుబ్బు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.