టాప్ న్యూస్

సొమ్ము సింగరేణిది.. సోకు సర్కారుది?

సింగరేణి సొమ్మును రేవంత్ సర్కార్ పబ్లిసిటీకి వినియోగిస్తున్నదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో వృథా ఖర్చులపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దసరా శుభాకాంక్షల పేరిట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోతో సింగరేణి సంస్థ కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగుల బార్డర్‌తో నాలుగు పేజీల కరపత్రాలను ముద్రించినట్టు తెలిసింది. ఇందుకు రూ.లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది. కార్మికుల సంక్షేమంపై కోతలు పెడుతున్న సర్కార్.. ప్రచారానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ సందర్భంగా కార్మికులకు కనీసం స్వీట్లు ఇవ్వని పంచని యాజమాన్యం.. కరపత్రాలకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.