తెలంగాణ
SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా సింగరేణి సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నిర్వహణ స్తంభించిపోయింది. వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో గనుల్లో తవ్వకాలు నిలిచిపోయి కార్మికులు, యాజమాన్యం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
