భారీగా పడిపోయిన సింగరేణి లాభాలు.. నేడు బీఆర్ఎస్ కార్మిక గర్జన
రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సింగరేణి సంస్థ లాభాలు నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన సంస్థ ఈ ఏడాది భారీ రాబడిని కోల్పోయింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సింగరేణి నిధులను ఇతర అవసరాల కోసం మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సింగరేణి లాభాలు 72.6 శాతం పతనం అయినట్టు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,754 కోట్లకే లాభాలు పరిమితం అయినట్టు సమాచారం. 2024-25లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.6,394 కోట్లు ఆర్జించిన సంస్థ..ఈ ఏడాదిలోనే రూ.4,640 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఒక్క ఏడాదిలో ఇంతభారీ మొత్తంలో సింగరేణి లాభాలు తగ్గడానికి గల కారణాలు చెప్పాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. గత నాలుగేళ్లలోనే అత్యల్ప వార్షిక లాభం రావడానికి కారణాలు ఏమై ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.
