వ్యాపారం
Silver : రూ.10 వేలు పెరిగిన ‘సిల్వర్’.. భగ్గుమన్న బంగారం!
పసిడి, వెండి ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా భారీగా ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి, పసిడి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు జంకుతున్నారు. అయితే, గ్లోబల్ వైడ్గా ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నితాకాయి. కేవలం సిల్వర్ ఒకే రోజు రూ.10 వేల వరకు ధర పెరగడం గమనార్హం. పసిడి సైతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా వెండి, గోల్డ్ ధరలు పోటీపడి మరీ పెరుగుతున్నాయి.ఆషాఢమాసం సేల్ అయిపోయింది.దీంతో బంగారం వ్యాపారులు, షోరూమ్స్ యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరగడంతో కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.
